Online Telugu magazine koumudi.net congratulates Pritya for bringing out an excellent cookbook ” Sukham Ayu”. It goes on to elaborate how Sukham Ayu is different from other cookbooks.

Translation of the last few lines are as follows: More than 60 recipes are categorized methodically under various heads like vegetarian curries, chutneys, soups, sweets, dals, snacks and fruit juices. Benefits of each recipe, the method of preparation are all dealt in an easy to understand manner. With over 100 colour pages and excellent print quality, the book is attractive as well as useful. The publishing house Pritya and the authors Jigyasa Giri and Pratibha Jain deserve to be commended for bringing out such a well researched Ayurvedic cookbook.
TRANSCRIPT OF THE ABOVE ARTICLE FOLLOWS:
యొగ పుంగవులు, ఋషులూ, శాస్త్రవేత్తలు కూడా ‘ప్రాణం’ (లైఫ్) అనే భావాన్ని అనేక రకాలుగా నిర్వచించారు. ఐతే ఆయుర్వేదం చెప్పేదాని ప్రకారం ‘ఆయు’ అంటే ప్రాణం (లైఫ్) అనేది శరీరం, హృదయం, మెదడు, వీటి భావాలు… అన్నిటి యొక్క సమగ్ర స్వరూపం, శరీరాన్ని, భావాలనీ ఒక క్రమ పద్ధథిలో వుండేలా చూసుకుంటే, మెదడు, హృదయం కూడా మన ఆధీనంలో ఉంటాయి. అలా జరిగినప్పు్డు వ్యాధులూ, మానసిక సమస్యలూ మనకి దూరంగా వుంటాయి. ఆలాంతి జీవితాన్నే ‘సుఖమయ జీవితం’ సుఖం – ఆయు అంటారు. అదే ఈ పుస్తకం పేరు. శరీరాన్ని ఆరొగ్యవంతంగా వుంచుకోవానటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మనం తినే తిండి మన ఆరోగ్య పరిస్ఠితిని నిర్ణయిస్తుందంటారు. వేదకాలం నుంచి కూడా ఆయుర్వేదం ఒక శాస్త్రంగా వర్ధిల్లింది. అంత విలువైన ఆయుర్వేద వి్జ్ఞాన పరంగా వి్శ్లేషిస్తూ, సమగ్ర ఆరోగ్యానికి అవసరమైన వంటకాల గురిచిన విశ్లేషాలతో నిండి వుందీ పుస్తకం. వివిధ కాయగూరలూ, వంట దినుసులూ, వాటి గుణగణాలని సశాస్త్రీయంగా విశ్లేషించడం మెచ్చుకొద్గ్గ విషయం.
ఎనిమిది అధ్యాయాలుగా విభజించబడిన ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయానికీ మొదట్లో వివిధ అంశాలు గురించిన ఆయుర్వేద విశ్లేషణని ఆసక్తికరమైన శైలో వర్ణిచారు. నేనెవరు? ప్రకృతికి మనిషికి సంభందం ఏమిటి? – పంచభూతాలు, వాటి ప్రత్యేకతలు, భోజనం యొక్క విశిష్టత, మెదడు మీద ఆహార ప్రభావం..ఇలా ఎంతో విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ విశేషాలే ఈ పుస్తకాన్ని మిగతా వంటల పుస్తకాలకొంటే భిన్నంగా నిలబెడతాయి. శాఖాహార కూరలు, పచళ్ళు, సూపులు, తీపి పదార్థాలు, పప్పులు, చిరుతిళ్ళూ, పళ్ళ రసాలు…ఇలా 60 పైగావంటలని ఒక క్రమ పద్ధతిలో వర్ణిచారు. ఒక్కో వంటకాన్నీ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు, వాటి వల్ల ఉపయొగాలూ, తయారు చేసే విధానం.. చాలా వివరంగా చెప్పారు. 100కి పైగా పుర్తి రంగుల పేజీలు, నాణ్యమైన ముద్రణ ఈ పుస్తకాన్ని ఉపయొగకరగనే కాక ఆకర్షణీయంగా కూడా తీర్చిది్ద్దాయి. సశాస్త్రీయమైన ఆయుర్వేద పరిశోధనల ప్రాతిపదికగా ఈ పుస్తకాన్ని రూపొందించిన ప్రచురణ్ కర్తలు ‘ప్రిత్య’ ని, గ్రంధకర్తలు జిగ్యాస గిరి, ప్రతిభా జైన్ గార్లని అభినందించి తీరాలి.
Related posts:



